PM Modi: కులగణన విషయంలో ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు

by Shamantha N |
PM Modi: కులగణన విషయంలో ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్షాలపై(opposition) ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీ స్వామినారాయణ ఆలయం 200వ వార్షికోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని వడ్తాల్‌లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. కులగణన (caste census)ను నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలను మండిపడ్డారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం సమాజాన్ని విభజించాలనుకున్న వారి ఆలోచనలను ప్రజలు గుర్తించి, తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. దేశ వ్యతిరేకులు పన్నే కుట్రలను దేశ ప్రజలంతా కలసికట్టుగా ఎదుర్కోవాలని మోడీ పిలుపునిచ్చారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనకబడిన తరగతులు అభివృద్ధి చెందడాన్ని కాంగ్రెస్ (Congress) తట్టుకోలేకపోతుందన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) ఓబీసీ (OBC) రిజర్వేషన్లను వ్యతిరేకించారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్‌ నేతలు ఓబీసీలలోని కులాలను విభజించడానికి చూస్తున్నారని మండిపడ్డారు.

యువతకు సందేశం

ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూస్తోందని మోడీ చెప్పుకొచ్చారు. దేశ అభివృద్ధి కోసం విద్యావంతులైన యువతను తయారుచేయాలని పిలుపునిచ్చారు. నైపుణ్యం కలిగిన యువతే దేశ భవిష్యత్తుకు అతిపెద్ద బలం అవుతుందని అన్నారు. ఏ దేశ నాయకులను కలిసినా ఇక్కడి యువతలో ఉన్న ప్రతిభను పొగుడుతూ.. వారికి తమ దేశంలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారని పేర్కొన్నారు. 2027లోపు భారత్‌ను అగ్రదేశాల సరసన నిలబెట్టడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని.. ఈ బాధ్యతను దేశ పౌరులు కూడా తీసుకోవాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed