- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లిలో పన్నీరు పెట్టలేదని కర్రలతో దాడి.. పలువురికి గాయాలు (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: వివాహ వేడుకల్లో చిన్న చిన్న లోపాలను పట్టుకుని కొంత మంది గొడవలు పడుతుంటారు. అవి కాస్త పెరిగి ప్రాణాలు తీసేదాక వెళ్తుంది. ఇటీవల ముఖ్యంగా ఆహార పదార్థాల విషయంలోనే ఎక్కువ గొడవలు తలెత్తుతున్నాయి. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లోని ఓ పెళ్లి వేడుకలో పనీరు పెట్టలేదని కర్రలతో దాడి చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లో ఓ వివాహ వేడుకలో వధువు కుటుంబ సభ్యులు వరుడు కుటుంబ సభ్యులకు పన్నీరు వడ్డించలేదని వారు కోపంతో ఊగిపోయారు. వధువు కుటుంబీకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పెళ్లి కూతురు బంధువులు వరుడు తరపు వారిని బ్రతిమిలాడారు. అయినా వారు శాంతించకపోవడంతో ఇరు కుటుంబాల మధ్య తోపులాట జరిగింది. అంతటితో ఆగకుండా ఇరువర్గాలు కర్రలతో, బెల్టులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గొడవను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
"फूफा का हुआ अपमान, तो बारात में घमासान"बागपत में एक शादी समारोह में दूल्हे के फूफा को पनीर न परोसने का अंजाम क्या हुआ इस वीडियो में देखिए। घराती और बाराती पक्ष में जमकर चले लाठी डंडे और बेल्ट। मौके पर पहुंची पुलिस ने दोनों पक्षो के कई लोगो को पकड़ा। pic.twitter.com/Jq5adLqSfF
— SANJAY TRIPATHI (@sanjayjourno) February 9, 2023