Atishi: పక్కన ఖాళీ కుర్చితో.. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అతిశీ

by Shamantha N |
Atishi: పక్కన ఖాళీ కుర్చితో.. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అతిశీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎంగా అతిశీ బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఆమె ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) కోసం పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి.. తాను వేరే సీట్లో కూర్చుని ఉన్న ఫొటోని ఆప్ సోషల్ మీడియా ఎక్స్ లో విడుదల చేసింది. ఆ ఫొటో వైరల్ గా మారింది. ఆ తర్వాత అతిశీ మీడియాతో మాట్లాడారు. తనకు ప్రస్తుతం భరతుడికి ఎదురైన పరిస్థితే ఉందన్నారు. రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు రాముడి పాదుకలు ఉంచి భరతుడు రాజ్యాన్ని పాలించినట్లు గుర్తిచేశారు. “ ఈ కుర్చీ అరవింద్ కేజ్రీవాల్‌ది. నాలుగు నెలల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మళ్లీ అధికారాన్ని చేపడతారు. అప్పటివరకు కుర్చీ ఇక్కడే ఉంటుంది.’’ అని ఆతిశీ అన్నారు.

కేజ్రీవాల్ స్థానంలో..

ఇకపోతే, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇటీవలే బెయిల్ పై వచ్చిన కేజ్రీవాల్.. సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో,తదుపరి సీఎంగా అతిశీ పేరుని కేజ్రీవాల్ ప్రతిపాదించగా.. ఆప్ ఎమ్మెల్యేలు మె తెలిపారు. దీంతో రెండ్రోజుల క్రితం ఆమె సీఎంగా ప్రమాణ చేశారు. ఆమెతో పాటు ఎమ్మెల్యేలుగా గెలిచిన ముకేశ్ అహ్లావత్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, కైలాశ్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్ కేబినేట్ మంత్రులుగా ప్రమాణం చేశారు.

Advertisement

Next Story

Most Viewed