- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 22 మంది మృతి
రాయ్‌పూర్: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో మంగళవారం ఓ బస్సు వంతెనపై నుంచి ఎండిపోయిన నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా.. 31 మంది గాయపడ్డారు. ఈ సంఘటన ఉదయం 8.40కి చోటు చేసుకుంది. ఈ బస్సు 50 మంది ప్రయాణికులతో ఖర్గోన్‌లోని శ్రీఖండి గ్రామం నుంచి ఇండోర్ వైపు వెళుతోంది. అయితే డొంగర్‌గావ్ గ్రామ సమీపంలోని వంతెన మీద రెయిలింగ్‌ను ఢీ కొట్టి బొరాడ్ నదిలో పడిపోయింది. క్షతగాత్రులను ఖర్గోన్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 22 మంది చనిపోయారని, 31 మందికి గాయాలయ్యాయని ఖర్గోన్ కలెక్టర్ శివ్‌రాజ్ సింగ్ వర్మ చెప్పారు. ప్రమాదంపై విచారణ జరుగుతోంది.
అయితే మృతుల్లో డ్రైవర్, క్లీనర్ ఉన్నట్టు సమాచారం. ఓవర్ లోడింగ్ కోణాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు విచారణాధికారులు చెప్పారు. ఈ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందింది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కోక్కరికి రూ. 4 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేలు తక్షణ ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పింది. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి ప్రతి కుటుంబానికి ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఇవ్వనున్నారు.