- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
రోడ్డు భద్రతపై అవగాహనకు రవాణా మంత్రి బైక్ ర్యాలీ
గుహవటి: రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు అస్సాం రవాణా మంత్రి పరిమళ్ సుక్లబైద్య సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీ ద్వారా ప్రజల్లో రహదారి భద్రత గురించి అవగాహన కల్పించనున్నట్లు ఆయన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రపంచ రోడ్డు బాధితుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభించిన ఈ కార్యక్రమ వివరాలను రెండవరోజు సోమవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. 'పథ్ సురక్ష జన్ ఆందోళన్' పేరుతో తాను బైక్ ర్యాలీ చేస్తున్నానని, ముఖ్యమంత్రి హిమంత విశ్వకర్మ ప్రోత్సాహంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.
ప్రస్తుతానికి గుహవటిలో ర్యాలీ జరుగుతోందని, రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలను కలిపేలా ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్టు పరిమళ్ స్పష్టం చేశారు. ర్యాలీలో భాగంగా ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వాధికారులతో పాటు అన్ని వర్గాలతోనూ సమావేశం నిర్వహించి అవగాహన కల్పిస్తానని, రోడ్డు భద్రత అందరి బాధ్యతగా గుర్తుచేస్తానని పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాదిలో అక్టోబర్ వరకు మిజోరంలో 6 వేలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. ఆ ప్రమాదాల్లో మరణాల శాతం 40.89గా ఉంది.