Muslim Marriages : ‘ముస్లిం వివాహాల నమోదు చట్టం’ రద్దు బిల్లుకు ఆమోదం

by Hajipasha |   ( Updated:2024-07-18 19:12:10.0  )
Muslim Marriages : ‘ముస్లిం వివాహాల నమోదు చట్టం’ రద్దు బిల్లుకు ఆమోదం
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘అసోం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం - 1935 రద్దు’’ బిల్లుకు అసోం రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లును రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సమర్పించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ‘‘అసోం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం’’ను రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలోనే రద్దు చేసింది. తాజాగా గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో.. ఆ రద్దు నిర్ణయానికి బలం చేకూర్చే బిల్లుకు ఆమోదం లభించింది.

‘‘వధువు 18 ఏళ్లకు చేరకపోయినా.. వరుడు 21 ఏళ్లకు చేరకపోయినా ముస్లింల వివాహ నమోదును అనుమతించే నిబంధనలను ముస్లిం వివాహాల చట్టం కలిగి ఉంది. అలాంటి బాల్య వివాహాలను అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగానే ముస్లిం వివాహాలు, విడాకుల చట్టం రద్దు చేశాం’’ అని పేర్కొంటూ అసోం సీఎం హిమంత బిస్వశర్మ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందేందుకే బీజేపీ సర్కారు ఇప్పుడు వివాదాస్పద అంశాలపై నిర్ణయాలు తీసుకుంటోందని విపక్షాలు ఆరోపించాయి.

Advertisement

Next Story

Most Viewed