అసోంని ముంచెత్తిన వర్షాలు.. తొంభైకి చేరిన మృతుల సంఖ్య

by Shamantha N |
అసోంని ముంచెత్తిన వర్షాలు.. తొంభైకి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: అసోంని వరదలు ముంచెత్తుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అన్ని నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల వల్ల శుక్రవారం మరో ఏడుగురు చనిపోయారు. దీంతో, వరదల వల్ల అసోం వ్యాప్తంగా చనిపోయినవారి సంఖ్య 90కి చేరింది. సుమారు 24 జిల్లాల్లోని 12.33 లక్షల మందికి పైగా ప్రజలపై వరద ప్రభావం పడిందని అసోం డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ తెలిపింది. వరద ఉద్ధృతి గతంలో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టిందని వెల్లడించింది.

జలదిగ్బంధంలో 2వేల గ్రామాలు

అసోంలోని 75 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 2406 గ్రామాలు, 32 వేల హెక్టార్ల సాగు భూములు ముంపునకు గురయ్యాయయి. ధుబ్రి జిల్లాలో 18,326 మంది, కాచర్‌లో 1,48,609 మంది, గోలాఘాట్‌లో 95,277 మంది, నాగాన్‌లో 88,120 మంది, గోల్‌పరాలో 83125 మంది, మజులిలో 82,494 మంది, సౌత్ సల్యాజీలో 73,662 మంది, ధేమాజీలో 73,662 మంది ప్రజలు వరద ప్రభావానికి గురైనట్లు అధికారులు తెలిపారు. ఇక వరద ప్రభావిత జిల్లాల్లోని 316 సహాయ శిబిరాల్లో 2.95 లక్షల మంది ప్రజలు ఆశ్రయంపొందుతున్నారు. కజిరంగా నేషనల్ పార్కుని వరదలు ముంచెత్తాయి. వరదల వల్ల ఇప్పటివరకు 10 ఖడ్గమృగాలు సహా 180 వన్యప్రాణులు చనిపోయాయి. వరదల సమయంలో రెండు ఖడ్గమృగాలు, రెండు ఏనుగులు సహా 135 జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అటవీశాఖ అధికారాలు తెలిపారు. నేషనల్ పార్క్‌లోని 35 అటవీ శిబిరాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి.



Advertisement

Next Story

Most Viewed