- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరువు నష్టం దావా వేస్తా.. రాహుల్ గాంధీకి సీఎం వార్నింగ్
దిశ, డైనమిక్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేస్తానని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ హెచ్చరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్‌తో తనకు లింక్ పెడుతూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌పై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. సోమవారం గువాహటిలో మీడియాతో మాట్లాడిన ఆయన...ఏప్రిల్ 14న ప్రధాని మోడీ అసోం పర్యటన ముగిసిన తర్వాత రాహుల్‌పై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ముమ్మాటికీ తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేదే అని అన్నారు. ప్రధాని అసోం నుంచి వెళ్లిన వెంటనే రాహుల్ ట్వీట్‌పై చర్యలు తీసుకుంటానని, గువహటిలో పరువునష్టం దావా వేస్తానని చెప్పారు.
ఈ అంశంపై ప్రస్తుతం తాను ఇంతకంటే ఎక్కువ స్పందించనని, రాజకీయాలు మాట్లాడబోనని..ఎందుకంటే ఇప్పుడు బిహు పండుగ వేడుకలను నిర్వహించుకోవాలని చెప్పారు. కాగా, ‘అదానీ, గులాం నబీ ఆజాద్, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కె. ఆంటోనీ పేర్లను ప్రస్తావిస్తూ...నిజాలని తప్పుదోవ పట్టిస్తున్నారు. అదానీ కంపెనీలలో 20,000 కోట్ల రూపాయల బినామీ సొమ్ము ఎవరిది? కాంగ్రెస్‌ను వీడిన తర్వాత ఆజాద్ సొంత పార్టీ పెట్టగా, మిగతా వారు బీజేపీలో చేరారు. సింధియా ఇప్పుడు కేంద్ర మంత్రి కాగా, హిమంత బిస్వా శర్మ అసోం ముఖ్యమంత్రి అయ్యారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు.