ఆశారం బాపుకు పెరోల్

by M.Rajitha |
ఆశారం బాపుకు పెరోల్
X

దిశ, వెబ్ డెస్క్ : లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బాబా ఆశారం బాపుకు పెరోల్ లభించింది. వృద్దాప్యం వల్ల తన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదని ఆశారం హైకోర్టుకు విన్నవించుకోగా.. చికిత్స నిమిత్తం జోధ్ పూర్ జైలు నుండి మహారాష్ట్రకు తరలించాలని, ఇందుకుగాను ఏడూ రోజుల పెరోల్ మంజూరు చేస్తూ రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మైనర్ బాలికపై లైంగికదాడి కేసులో నేరం రుజువు కావడంతో జోధ్ పూర్ కోర్టు ఆశారంకు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఆశారం జోధ్ పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా తన ఆరోగ్య సంబంధిత సమస్యల రీత్యా పోస్కో కేసు నుండి మినహాయింపు కోరుతూ గతేడాది ఆశారం బాపు సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకోగా.. ధర్మాసనం ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. కావాలంటే వైద్యం కోసం రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ హైకోర్టులో అప్పీల్ చేసుకోగా.. కోర్టు పెరోల్ మంజూరు చేసింది.

Next Story

Most Viewed