Aryan Khan drugs case : మున్మున్ ధమేచాకు నోటీసులు జారీ చేసిన సీబీఐ

by Shiva |
Aryan Khan drugs case : మున్మున్ ధమేచాకు నోటీసులు జారీ చేసిన సీబీఐ
X

దిశ, వెబ్ డెస్క్ : 2021లో ముంబై డ్రగ్ క్రూయిజ్ కేసులో ఆర్యన్ ఖాన్‌తో పాటు అరెస్టైన నిందితుల్లో ఒకరైన మున్మున్ ధమేచాకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సమన్లు పంపింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై జరుగుతున్న విచారణలో భాగంగా ధమేచాకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. కార్డెలియా క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలివుడ్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను తప్పించేందుకు అతడి నుంచి రూ.25 కోట్ల లంచం డిమాండ్ చేసినందుకు వాంఖడేపై మే లో సీబీఐ క్రిమినల్ కేసు నమోదు చేసింది.

ప్రస్తుతం వాంఖడేపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 7A,12, ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్లు 120B (నేర పూరిత కుట్ర), సెక్షన్ 388 (బెదిరింపు ద్వారా దోపిడీ) కింద కేసులు నమోదు చేసింది సీబీఐ. బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టై 22 రోజులు ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. మరో ఇద్దరు మున్మున్ ధమేచా, ఆర్యన్ స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ లను కూడా అరెస్టు చేశారు. అయితే, తగిన సాక్ష్యాలు లేకపోవడం వల్ల కారణంగా బాంబే హైకోర్టు అక్టోబర్ 28న ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు బెయిల్ మంజూరు చేసింది.

ఎన్‌సీబీ టీం, వాంఖడేపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ప్రత్యేక విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో మాజీ ఎన్‌సీబీ అధికారిని తరువాత చెన్నైలోని డీజీ ట్యాక్స్‌ పేయర్ సర్వీస్ డైరెక్టరేట్‌కు బదిలీ చేశారు. బాంబే హైకోర్టు ఆదేశానుసారం తదుపరి విచారణ తేదీ వరకు సమీర్ వాంఖడే ప్రస్తుతం సీబీఐ రక్షణలో ఉండనున్నాడు.

Advertisement

Next Story

Most Viewed