- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Arvind Singh: మహారాణా ప్రతాప్ వంశస్తుడు అరవింద్ సింగ్ మేవార్ కన్నుమూత

దిశ, నేషనల్ బ్యూరో: మహారాణా ప్రతాప్ వారసుడు, హెచ్ఆర్ హెచ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్ అరవింద్ సింగ్ మేవార్ (81) (Arvind singh mewar) ఆదివారం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించి రాజస్థాన్ (Rajasthan) లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న సిటీ ప్యాలెస్ (City palace)లోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య విజయరాజ్ కుమారి, కుమారుడు లక్ష్యరాజ్ సింగ్ మేవార్, కుమార్తెలు భార్గవి కుమారి మేవార్, పద్మజ కుమారి పర్మార్ ఉన్నారు. మహారాణా ప్రతాప్ వారసుడైన అరవింద్ సింగ్ మేవార్, భగవత్ సింగ్ మేవార్, సుశీలా కుమారి మేవార్‌ల కుమారుడు. అతని అన్నయ్య మహేంద్ర సింగ్ మేవార్ గతేడాది నవంబర్ 10న మరణించారు. అరవింద్ సింగ్ అంత్యక్రియలు సోమవారం జరగనుండగా ఆయన గౌరవార్థం ఉదయ్ పూర్ సిటీ ప్యాలెస్ రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
అరవింద్ సింగ్ మేవార్ 1944 డిసెంబర్ 13న ఉదయపూర్ సిటీ ప్యాలెస్‌లో జన్మించారు. ఉదయపూర్‌లోని మహారాణా భూపాల్ కళాశాల నుండి ఆర్ట్స్‌లో పట్టభద్రుడయ్యాడు. లండన్‌లో ఉన్నత విద్యను పూర్తి చేసిన ఆయన కొంత కాలం అమెరికాలో పని చేశారు. రాజస్థాన్‌లో అనేక చారిత్రాత్మక హోటళ్లను నిర్వహిస్తున్న హెచ్ఆర్ హెచ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌కు ఆయన చైర్మన్‌గా ఉన్నారు. క్రికెట్ పైనా ఆసక్తి ఉన్న మేవార్ 1945-46లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత పలు కారణాల వల్ల ఆటకు దూరంగా ఉన్నారు. మేవార్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.