Arvind Sawant: మహిళా నేతపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన ఎంపీ

by vinod kumar |
Arvind Sawant: మహిళా నేతపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన ఎంపీ
X

దిశ, నేషనల్ బ్యూరో: శివసేన(Shivasena) షిండే వర్గానికి చెందిన మహిళా నేత షైనా ఎన్సీపై(Shaina NC) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను శివసేన(UBT) ఎంపీ అరవింద్ సావంత్ (Arvind Sawant) క్షమాపణలు చెప్పారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తన ప్రకటన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. 55 ఏళ్ల రాజకీయ జీవితంలో మహిళలను ఎప్పుడూ అవమానించలేదని తెలిపారు. గ‌త కొన్ని రోజులుగా తాను మ‌హిళ‌ల‌ను అవ‌మాన‌ప‌రిచినట్లు ఆరోప‌ణలు వ‌స్తున్నాయ‌ని, కావాలనే కొందరు టార్గెట్(Target) చేశారని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన ప్రకటనకు వేరే అర్థాన్ని ఇస్తూ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, షైనా ఎన్సీ ఇటీవల బీజేపీని వీడి శివసేనలో చేరారు. అనంతరం ముంబదేవి(Mumbadevi) స్థానం నుంచి శివసేన తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఇదే విషయమై సావంత్ మాట్లాడుతూ.. షైనా దిగుమతి చేసుకున్న ఉత్పత్తి(Imported mall) అని అభివర్ణించారు. దిగుమతి చేసుకున్న వస్తువల కంటే శివసేన(యూబీటీ) వస్తువులు ఒరిజినల్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై షైనా తీవ్రంగా స్పందించారు. ముంబైలోని నాగ్‌పడా పోలీస్ స్టేషన్‌లో సావంత్‌పై ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శివసేన షిండే వర్గానికి చెందిన మహిళా విభాగం కూడా సావంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సావంత్ క్షమాపణలు చెప్పారు.

Advertisement

Next Story