- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేజ్రీవాల్ ను చంపేందుకు జైళ్లో కుట్ర జరుగుతోంది- ఢిల్లీ మంత్రి
దిశ, నేషనల్ బ్యూరో: కేజ్రీవాల్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యం దెబ్బ తినేలా సకాలంలో మందులు ఇవ్వకూడదని కేంద్రం ఆలోచిస్తుందని మండిపడ్డారు. కేజ్రీవాల్ కొన్ని నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాలేయం, ఊపిరితిత్తులు, గుండెకు చికిత్స పొందుతూ క్రమంగా మరణించే అవకాశం ఉందన్నారు. కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ అవసరమైతే ఇన్సులిన్ ఇవ్వాల్సిందేనని మేము కోరుకుంటున్నామని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. జైలులో ఉన్న కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ రీడింగ్‌లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇవ్వనందుకు తీహార్ జైలు అధికారులు, బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ ఎల్జీపై మండిపడ్డారు. కేజ్రీవాల్ గత 20-22 ఏళ్లుగా డయబెటిస్ తో బాధపడుతున్నారని గుర్తు చేశారు.
డయబెటిస్ తో బాధపుతున్న కేజ్రీవాల్.. తన పర్సనల్ డాక్టర్ ని కలిసేందుకు అనుమతించాలని ఢిల్లీ కోర్టుని ఆశ్రయించారు. దీనిపైన గురువారం విచారణ జరిగింది. విచారణలో భాగంగా కేజ్రీవాల్ పై ఈడీ పలు ఆరోపణలు చేసింది. ఇంటి భోజనానికి కేజ్రీవాల్ కు అనుమతి ఉందని.. దీంతో మామిడి పండ్లు, ఆలూ పూరి తిని షుగర్ లెవల్స్ పెంచుకుంటున్నారని ఆరోపించింది. షుగర్ లెవల్స్ పెంచుకుని అనారోగ్యం కారణంగా బెయిల్ పొందాలని చూస్తున్నట్లు ఈడీ మండిపడింది.ఈడీ ఆరోపణలను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది ఖండించారు. దీంతో కేజ్రీవాల్ చక్కెరస్థాయిలు పర్యవేక్షించేందుకు మెషీన్ ను అనుమతించింది ఢిల్లీ కోర్టు.