- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'Make India No.1'కు కేజ్రివాల్ శ్రీకారం.. బిజెపి, కాంగ్రేస్‌లకు పిలుపు! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బుధవారం 'మేక్ ఇండియా నంబర్ 1' మిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని ప్రతి మూలలో పాఠశాలలను నిర్మించడానికి దేశం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. దీని కోసం బీజేపీ, కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు తనకు సహకరించాలని ఆయన కోరారు. ఈ మిషన్‌లో విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రధాన దృష్టి పెట్టాల్సి ఉందని ఆయన అన్నారు.
"ఈ మిషన్ ద్వారా మొత్తం 130 కోట్ల మంది భారతీయులను అనుసంధానం చేయాల్సి ఉంది. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది. మనం చాలా సాధించాము. కానీ ప్రజలు కోపంగా ఉన్నారు. ఇన్నేళ్లలో చాలా చిన్న దేశాలు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటే ముందున్నారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "పిల్లలకు మంచి, ఉచిత విద్యను ఏర్పాటు చేయాలి. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు తెరవాలి. ప్రతి పేద విద్యార్థికీ మంచి విద్య అందించడం వల్ల వారి కుటుంబం పేదరికం నుండి ధనవంతులుగా మారుతుంది. అప్పుడు భారతదేశం పేరు సంపన్న దేశాల జాబితాలో చేరుతుంది. అదే 'Make India No.1' మిషన్ "అని కేజ్రీవాల్ అన్నారు. దీని కోసం "మనం పని చేయవలసిన రెండవ అంశం ఉత్తమమైన ఉచిత వైద్యం అందించడం. మూడో అంశం మన యువత శక్తి. నేడు యువత నిరుద్యోగులుగా ఉన్నారు. వారికి ఉపాధి కల్పించాలి. యువత మన బలం," అని కేజ్రివాల్ పేర్కొన్నారు.