- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారం..రంగంలోకి చైనా ఆర్మీ
దిశ, నేషనల్ బ్యూరో : ఇంతకుముందు చైనా విదేశాంగ శాఖ.. ఇప్పుడేమో చైనా ఆర్మీ మన అరుణాచల్ ప్రదేశ్‌పై విషం కక్కింది. అరుణాచల్ ప్రదేశ్ ముమ్మాటికీ తమదేనని చైనా రక్షణ శాఖ ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ జియోగాంగ్ వెల్లడించారు. ఆ రాష్ట్రంలో భారత సైన్యం, ప్రభుత్వం ఉనికి అక్రమమైనదని ఆరోపించారు. ‘‘అరుణాచల్‌ను భారత భూభాగంగా మేం ఎన్నడూ గుర్తించబోం. అది ఎప్పటికీ చైనాలో అంతర్భాగంగానే ఉంటుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. స్థానిక మీడియాతో మాట్లాడుతూ జాంగ్ జియోగాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనా బార్డర్‌కు అత్యంత సమీపంలో ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటించారు. ఆసందర్భంగా సేలా అనే భారీ టన్నెల్‌ను ప్రారంభించారు. ఈ టన్నెల్ భారత ఆర్మీ రాకపోకలకు మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మార్చనుంది. సేలా టన్నెల్ ప్రారంభమైనప్పటి నుంచే భారత్‌పైకి చైనా విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టింది.