- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యపాత్ర: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఈటానగర్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో ఆమె ప్రత్యేక సెషన్ లో ప్రసంగించారు. అరుణాచల్ ప్రదేశ్ తో సహా ఇతర రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళ భాగస్వామ్యం పెంచాలని ఆమె కోరారు. ఇతర వ్యవస్థలోనూ ఇది ఉండాలని అన్నారు. ఈశాన్య ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్ దేశంలో ప్రధాన వాటదారుగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రోడ్డు, రైల్వే, విమాన కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఈశాన్య ప్రాంతాలు చాలా కాలంగా ఆర్థికాభివృద్ధికి దూరమైందని అన్నారు. కానీ కేంద్రం ఈ ప్రాంత అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ లో అభివృద్ధి సూర్యుడి వలె ప్రకాశిస్తుందని అన్నారు.
గొప్ప సహజ వనరులు, నాణ్యమైన మానవ వనరులతో, రాష్ట్రం ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా, వాణిజ్య, వ్యాపార కేంద్రంగా మారడానికి పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేయాలని రాష్ట్రపతి శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. వైవిధ్యతతో దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందన్నారు. ఈ-విధాన్ చొరవ ద్వారా పేపర్‌లెస్‌గా వెళ్లాలనే రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ, ఇటువంటి ఆవిష్కరణ ఇతర రాష్ట్రాలు అనుకరించడానికి రోల్ మోడల్‌గా ఉండాలని అన్నారు. శతాబ్దాలుగా అరుణాచల్ ప్రదేశ్‌లో స్వయం పాలన, అట్టడుగు ప్రజాస్వామ్యం శక్తివంతమైన వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఆధునిక ప్రజాస్వామ్య ప్రక్రియలో కూడా చురుకుగా పాల్గొన్నారని చెప్పారు. ఇది వారి రాజకీయ స్పృహను, ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.