ఆర్టికల్ 370ని ఎవరూ తొలగించలేరు..

by S Gopi |
ఆర్టికల్ 370ని ఎవరూ తొలగించలేరు..
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. జమ్మూ కశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్ అధ్యక్షూడు డా హుస్సెన్, జమ్మూ కశ్మీర్ అవామి నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ముజఫర్ షా దీనిపై స్పందిస్తూ, 'ఆర్టికల్ 370ని తొలగించలేం, తాము రివ్యూ పిటిషన్ దాఖలు చేశాం. ఈ వ్యవహారంపై కోర్టులోనే చర్చించనున్నట్టు' స్పష్టం చేశారు. సీపీఐ(ఎం)కి చెందిన మహమ్మద్ యూసుఫ్, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన లాయర్ ముజఫర్ ఇక్బాల్, పీడీపీలు సైతం కోర్టులో రివ్యూ పిటిషన్లను దాఖలు చేశాయి. గత నెల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం, ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన సంగతి తెలిసిందే. ఇది తాత్కాలిక నిబంధన మాత్రమేనని, యుద్ధకాల పరిస్థితుల నేపథ్యంలో దీన్ని రూపొందించినట్టు పేర్కొంది. భారత యూనియన్‌లో చేరిన అనంతరం జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కలిగి ఉండదని, రాజ్యాంగ పరిషత్ ఆగిన కారణంగా ఆర్టికల్ 370 శాశ్వతంగా కొనసాగుతుందని భావించకూడదని వెల్లడించింది. అలాగే, ఆర్టికల్ 370 రద్దుకు ఉత్తర్వులు జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో 2024, సెప్టెంబర్ 30లోగా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ కోసం ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story