Army officer: ఎన్‌సీసీ క్యాంపులో ఆర్మీ అధికారిపై దాడి.. కేరళలో ఘటన

by vinod kumar |
Army officer: ఎన్‌సీసీ క్యాంపులో ఆర్మీ అధికారిపై దాడి.. కేరళలో ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) క్యాంపులో ఆర్మీ అధికారిపై దాడి జరిగింది. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఈ నెల 23న ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేఎంఎం కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌ కళాశాల విద్యార్థులకు త్రిక్కక్కరాలో ఎన్‌సీసీ క్యాంప్ జరుగుతోంది. అయితే ఈ నెల 23న రాత్రి భోజనం చేసిన తర్వాత 80 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు ఉండటంతో వారందరినీ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ (SFI) విద్యార్థి సంఘం నేతలు, స్థానిక బీజేపీ కౌన్సిలర్ ప్రమోద్ వారి మద్దతు దారులతో కలిసి క్యాంపు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే క్యాంపును నిర్వహిస్తున్న ఆర్మీ అధికారిపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ కర్నైల్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed