నీతి ఆయోగ్ నూతన పాలక మండలి నియామకం.. వైస్ చైర్మన్ ఎవరంటే..?

by Satheesh |   ( Updated:2024-07-16 17:18:51.0  )
నీతి ఆయోగ్ నూతన పాలక మండలి నియామకం.. వైస్ చైర్మన్ ఎవరంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కొలువుదీరిన మోడీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ చైర్మన్‌గా నీతి ఆయోగ్ నూతన పాలకమండలిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన మంత్రి చైర్మన్‌గా ఉండే నీతి ఆయోగ్ పాలక మండలికి సుమన్ భేరిని వైస్ చైర్మన్‌గా నియమించింది. నీతి ఆయోగ్ శాశ్వత సభ్యులుగా నలుగురు పాత వారినే కొనసాగించింది. వీకే సారస్వత్, ప్రొ. రమేష్ చంద్, డా. వీకే పాల్, అరవింద్ విర్మానీ ఫుల్ టైమ్ మెంబర్స్‌గా కంటిన్యూ కానున్నారు. నీతి ఆయోగ్ పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా టీడీపీ నేత, పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడుకు అవకాశం కల్పించింది. నీతి ఆయోగ్ ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా కేంద్ర రక్షణ, హోం, వ్యవసాయ, ఆర్థిక శాఖ మంత్రులు.. ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర ఉపరితల రవాణా, ఆరోగ్య, భారీ పరిశ్రమలు, చిన్న మధ్యతరహా ఎంటర్ప్రెస్సెస్, పంచాయితీరాజ్, సామాజిక న్యాయం, పౌర విమానయాన, గిరిజన, మహిళా శిశు సంక్షేమ, ఆహార శాఖల మంత్రులు ఉండనున్నారు.

Advertisement

Next Story

Most Viewed