హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఏఐసీసీ పరిశీలకుల నియామకం

by Y. Venkata Narasimha Reddy |
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఏఐసీసీ పరిశీలకుల నియామకం
X

దిశ వెబ్ డెస్క్ : హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఏఐసీసీ సీనియర్ పరిశీలకులుగా సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, అజయ్ మాకెన్, ప్రతాప్ సింగ్ బజ్వాలను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్‌ 1వ తేదీన హర్యానాలోని 90 స్థానాల శాసనసభకు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ తథ్యమని పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటోందనీ, ఆ ప్రభుత్వ వ్యతిరేకతే తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉంటుందని, ఇక ప్రాంతీయపార్టీ అయిన జననాయక్‌ జనతా పార్టీ (జె.జె.పీ) ఎప్పటి మాదిరిగానే తన మూడవ స్థానంలో నిలిచే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ సారైనా హర్యానాలో అడుగుపెట్టాలని గట్టి పట్టుదలతో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఇండీ కూటమి భాగస్వామ్యపక్షంగా కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి. అయితే బీజేపీ కూడా ప్రజలలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు పలు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను తప్పించి ఆయన స్థానంలో నాయబ్ సింగ్ సైనీని కూర్చోబెట్టింది. అలాగే పలు సంక్షేమ పథకాలను చేపట్టి ప్రజాభిమానాన్ని పొందడంపై దృష్టి కేంద్రీకరించింది.

Advertisement

Next Story

Most Viewed