హ్యాకింగ్ థ్రెట్ అలర్ట్‌పై యాపిల్ సంస్థ క్లారిటీ.. తప్పుడు అలారం అని వ్యాఖ్య

by Mahesh |   ( Updated:2023-10-31 09:20:42.0  )
హ్యాకింగ్ థ్రెట్ అలర్ట్‌పై యాపిల్ సంస్థ క్లారిటీ.. తప్పుడు అలారం అని వ్యాఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజు భారత్‌లోని పలువురు ఎంపీల సెల్ ఫోన్లకు హ్యాకింగ్ థ్రెట్ అలర్ట్‌ మెసెజెస్, అలాగే యాపిల్ కంపెని నుంచి థ్రెట్ మెయిల్స్ వచ్చాయి. దీంతో ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, శశి థరూర్‌, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తో సహా పలువురు ప్రతిపక్ష నేతలు తమ ఐఫోన్‌లు హ్యకింగ్‌కు ప్రయత్నిస్తున్నట్లు ఆపిల్ కంపెనీ నుంచి హెచ్చిరిక మెయిల్స్ వచ్చినట్లు ఇవాళ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

అందులో ‘ అలెర్ట్, స్టేట్ స్పాన్స్‌సర్డ్ అటాకర్స్ మే బీ టార్గెటింగ్ యువర్ ఫోన్’ అంటూ ఐఫోన్ కంపెనీ హెచ్చరించిన మెసెజ్‌లు స్క్రీన్ షాట్ తీసీ నేతలు పోస్ట్ చేశారు. అయితే ఎంపీలు అందుకున్న హ్యాకింగ్ థ్రెట్ అలర్ట్‌పై యాపిల్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. స్టేట్ స్పాన్స్‌సర్డ్ అటాకర్స్ మే బీ టార్గెటింగ్ యువర్ ఫోన్ అని వచ్చిన అలర్డ్ బెదిరింపు నోటిఫికేషన్‌ అని, ఈ హెచ్చరికలు పంపడానికి గల కారణం చూపలేదని.. నోటిఫికేషన్ అలర్ట్ కూడా తప్పుడు అలారం కావచ్చని యాపిల్ కంపెనీ తెలిపింది.

కాగా గతంలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు వెల్లడైంది. ఇజ్రాయెల్‌లోని ఎన్ఎస్‌వో గ్రూప్‌నకు చెందిన ‘పెగాసస్’ అనే స్పైవేర్ సాయంతో ఈ హ్యాకింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉందని ఆరోపణలతో అప్పట్లో దేశంలో పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో తమకెలాంటి సంబంధం లేదని గతంలోనే కేంద్రం వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed