Delhi Liquor Scam : బ్రేకింగ్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరి అరెస్ట్

by srinivas |   ( Updated:2023-05-15 10:45:51.0  )
Delhi Liquor Scam : బ్రేకింగ్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరి అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కాం కేసులో సోమవారం సీబీఐ మరొకరిని అరెస్ట్ చేసింది. అరవింద్ సింగ్ అనే న్యూస్ ఛానెల్ ఉద్యోగిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. రూ.17 కోట్ల నగదు లావాదేవీలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితుల్లో ఒకరి నుండి వచ్చిన డబ్బును ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధం ఉన్న కంపెనీకి నగదును బదిలీ చేసినట్టుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

2021 జూన్, 2022 జూన్‌లో ఈ లావాదేవీలు జరిగాయని సమాచారం. ఈ లావాదేవీల అంశంలో అరవింద్ సింగ్‌ను సీబీఐ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో అరవింద్ సింగ్ పాత్ర ఉన్నట్లు విచారణలో సిబీఐ గుర్తించింది. అందులో భాగంగా అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు.

Advertisement

Next Story