పంజాబ్‌లో మరోసారి చైనా డ్రోన్ కలకలం: స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్

by Dishanational2 |
పంజాబ్‌లో మరోసారి చైనా డ్రోన్ కలకలం: స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లోని టార్న్ టరన్ జిల్లాలో బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) దళాలు చైనా డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని దాల్ గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ డ్రోన్ లభ్యమైనట్టు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. పంజాబ్ సరిహద్దులో బీఎస్ఎఫ్ బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా..అనుమానిత శబ్దాన్ని గమనించిన సైనికులు ఓ యంత్రం కింద డ్రోన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రోన్ చైనా తయారు చేసిన డీజీ మాసివ్ క్లాస్-3గా గుర్తించారు. ఇది పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై అధికారులు ఆరాతీస్తున్నారు. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని వెల్లడించారు. కాగా, అంతకుముందు కూడా అమృత్‌సర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలోని వేర్వేరు ప్రదేశాల నుంచి రెండు చైనా డ్రోన్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవి కూడా డీజీ మాసివ్ క్లాస్-3 కావడం గమనార్హం.

Next Story

Most Viewed