- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP: తెలుగువారిపై అన్నమయ్య నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: అన్నమయ్య (Annamaiah) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటి, తమిళనాడు బీజేపీ మహిళా నాయకురాలు కస్తూరి (BJP Women Leader Kasthuri) తెలుగు ప్రజల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజులు, మహరాజుల కాలంలో సేవకులుగా పని చేయడానికి తెలుగువారు తమిళనాడుకు వచ్చారంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇటీవల నిర్వహించిన బీజేపీ (BJP) సభలో ప్రసంగించిన కస్తూరి ద్రావిడ సిద్ధాంత వాదులను నిలదీశారు. వారి ఐడియాలజీని ప్రశ్నించే క్రమంలోనే తెలుగు వారి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘‘300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చారు. అలా వచ్చిన వాళ్లు ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని ఎలా అంటున్నారు? ప్రస్తుత తమిళనాడు (Tamilnadu) మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. ఇతరుల ఆస్తులు లూటీ చేయొద్దు. ఇతరుల భార్యలపై మోజుపడొద్దు. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దు. అని బ్రాహ్మణులు (Brahmin) చెబుతున్నారు. ఇలా మంచి చెబుతున్నారు కాబట్టే వారికి వ్యతిరేకంగా తమిళనాడులో ప్రచారం సాగుతోంది’ అంటూ కస్తూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ నేలపైనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా చిచ్చు రేపుతున్నాయి.
Read More : క్రీస్తుపూర్వం నుంచే చైనాలో రామాయణం