- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Haryana: ఒక్క దున్నపోతు ధర అక్షరాలా రూ.23 కోట్లు..
దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలో(Haryana) ఒక్క దున్నపోతు ఖరీదు అక్షరాలా రూ.23 కోట్లు. అయితే, అంత డబ్బు ఇచ్చినా దాన్ని అమ్మనని దాని యజమాని కూడా చెబుతున్నాడు. దీంతో, ఇప్పుడు ఆ దున్నపోతు గొప్పతనం ఏంటో అనేది సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. హర్యానాలోని సిర్సాకు చెందిన పల్వీందర్ సింగ్ అనే రైతు ఈ అన్మోల్(Anmol) దున్నపోతును పెంచుతున్నాడు. దాని వయసు 8 ఏళ్లు. బరువు 1500 కిలోలు. ఇక దాని ధర విషయానికి వస్తే.. రూ.23 కోట్లు ఇస్తానన్నా పల్వీందర్ సింగ్ మాత్రం అమ్మలేదు అంటే దాని ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు. పుష్కర్ మేళా, మీరట్‌లోని ఆల్ ఇండియా ఫార్మర్స్ ఫెయిర్ వంటి ఈవెంట్లలో ఈ అన్మోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అన్మోల్ ధర, భారీ ఆకారమే.. దాన్ని వార్తల్లో నిలిచేలా చేస్తోంది.
అన్మోల్ గొప్పదనం ఎంతంటే?
ఇవేకాకుండా, అన్మోల్ తినే తిండి కోసం పల్వీందర్ నిత్యం రూ.1500 ఖర్చు చేస్తూ ఉంటారు. అంటే నెలకు దాని తిండికే రూ.45 వేల వరకు దాని యజమాని భరిస్తాడు. రోజూ 250 గ్రాముల బాదాం, 4 కిలోల దానిమ్మలు, 30 అరటిపండ్లు, 5 లీటర్ల పాలు, 20 గుడ్లను ఆహారంగా తీసుకుంటుంది. వీటితోపాటు ఆయిల్ కేక్, పచ్చి గడ్డి, దేశీ నెయ్యి, సోయాబీన్, మొక్కజొన్నలను కూడా తింటుంది. ఇక రోజుకు రెండుసార్లు దానికి స్నానం చేయిస్తూ ఉంటాడు. ఆ సమయంలో బాదాం ఆయిల్, ఆవ నూనెతో మసాజ్ చేస్తూ ఉంటాడు. అయితే, ఈ అన్మోల్ దున్నపోతుకు అంత ధర పలకడానికి.. దానికి అంత ఖర్చు పెట్టి పెంచడానికి కారణం దాని వీర్యం కోసమే. వారానికి రెండుసార్లు నుంచి అన్మోల్ వీర్యాన్ని సేకరిస్తూ ఉంటారు. ఇలా ఒక్కసారి తీసిన వీర్యం 300 నుంచి 900 గేదెలకు సరిపోతుందని పల్విందర్ సింగ్ తెలిపాడు. అయితే ఒక్కో గేదెకు రూ.250 చొప్పున విక్రయిస్తున్నాడు. దీంతో, నెలా రూ.4-5 లక్షలు సంపాదిస్తున్నాడు. అంత ధర, డిమాండ్‌కు కారణం ఈ అన్మోల్ దున్నపోతు వీర్యానికి ఉన్న నాణ్యత. అయితే ఇంత డబ్బును తెచ్చిపెడుతున్న దున్నపోతును ఎట్టి పరిస్థితుల్లో అమ్మేది లేదని పల్విందర్ సింగ్ తేల్చి చెబుతున్నాడు.