- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగుల కోసం ‘అంబానీ’ గ్రాండ్ రిసెప్షన్
దిశ, నేషనల్ బ్యూరో : పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహానికి సంబంధించిన చివరి రిసెప్షన్ సోమవారం జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ రిసెప్షన్‌లో అంబానీ కుటుంబీకుల నివాసాల్లో పనిచేసే వేలాది మంది సిబ్బంది, రిలయన్స్ ఉద్యోగులు పాల్గొన్నారు. కరోనా కారణంగా అనంత్ అంబానీ పెళ్లికి హాజరు కాలేకపోయిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సతీసమేతంగా ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈసందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. ‘‘నాకు మీరు ఎలాగైతే సహకరిస్తున్నారో.. అదే విధంగా భవిష్యత్తులో నా వారసులు ఆకాశ్, ఈషా, అనంత్‌లకు కూడా సహకరించండి.. వాళ్లు నాకంటే పదిరెట్లు ఎక్కువగా మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు’’ అని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభం కాగానే స్వయంగా నీతా అంబానీ మైక్ చేత పట్టుకొని తమ కుటుంబ సభ్యులు ఒక్కరొక్కరిని పరిచయం చేశారు.