- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటకలో బీజేపీని భారీ దెబ్బకొట్టిన వ్యక్తి ఓటమి
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో రసవత్తరంగా మారాయి. పలు చోట్ల ఓటర్లు ఊహించని తీర్పు ఇచ్చారు. హంగ్ వస్తుందన్న అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే దిశగా ఫలితాలు సాధించింది. అయితే పుత్తూరు నియోజకవర్గం విషయంలో ఆసక్తికర ఫలితం వెలువడింది. ఆర్ఎస్ఎస్ తిరుగుబాటు నేత అరుణ్ కుమార్ పుతిల కారణంగా ఇక్కడ బీజేపీ మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. నిజానికి ఇక్కడ అరుణ్ కుమార్ పుతిల బీజేపీ తరపున టికెట్ ఆశించారు. కానీ కొన్ని సమీకరణాల కారణంగా అధిష్టానం ఆయనకు బదులు తిమ్మప్పను ఎంపిక చేసింది.
దీంతో పుతిల స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. తిమ్మప్పకు పుతిలకు మధ్య ఓట్ల చీలక కాంగ్రెస్‌కు అనుకూలంగా మారింది. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థికి, సంఘ్ తిరుగుబాటు నేతకు మధ్య చివరి వరకు హోరాహోరీగా పోటీ సాగింది. కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ 66,607 ఓట్లుతో విజయం సాధించగా అరుణ్ కుమార్ పుతుల 62,458 ఓట్లు సాధించాడు. ఇక బీజేపీ అభ్యర్థి తిమ్మమ్మ కేవలం 37,558 ఓట్లతో మూడో స్థానానికే పరిమితం అయ్యారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో అరుణ్ కుమార్ పుతులకే బీజేపీ టికెట్ కేటాయించి ఉంటే అఖండ విజయం సాధించి ఉండేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: