- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తమ విడుదలకు ఆదేశాలివ్వాలి..రష్యా సైన్యంలోని ఓ భారతీయుడి ఆవేదన!
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా సైన్యంలో ఉన్న భారతీయులను రిలీజ్ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల రష్యా పర్యటన సందర్భంగా ఆదేశ అధ్యక్షుడు పుతిన్ కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు పుతిన్ సైతం అంగీకరించారు. త్వరలోనే ఇండియన్స్ ను విడుదల చేస్తామని తెలిపారు. అయితే మోడీ చర్చించిన కొద్దిసేపటికే ఉక్రెయిన్ యుద్ధంలో ముందు వరుసలో పోరాడాలని తమను రష్యా ఆదేశించినట్లు అక్కడి సైన్యంలో పనిచేస్తున్న ఓ భారతీయుడు వెల్లడించారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన గగన్‌దీప్ సింగ్ అనే వ్యక్తి మాట్లాడుతూ..తమను విడుదల చేయాలని ఇంకా ఆదేశాలు రాలేదని తెలిపారు. అంతేగాక ముందు వరుసలో ఉండి పోరాడాలని రష్యా ఆర్డర్స్ జారీ చేసినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. గాయం నుంచి కోలుకోకముందే యుద్ధంలో చేరాలని తెలియజేసినట్టు వెల్లడించారు. ఇక్కడ భయకరయైన పరిస్థితి ఉందని చెప్పారు. ‘నా ఇష్టానుసారం రష్యా సైన్యంలో చేరలేదు. యూకేలో పని చేయడానికి అర్హత సాధించే ప్రయత్నంలో రష్యాకు వెళ్లాను. అయితే బెలారస్ పర్యటనలో వీసా లేకుండా గుర్తించి రష్యా సైన్యానికి అప్పగించారు’ అని ఓ మీడియా చానల్ తో వ్యాఖ్యానించారు. భారతీయుల విడుదలకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరారు.