పాదాలు తాకగానే లేచి నిల్చొని ఆశీర్వదిస్తున్న గణపయ్య.. వీడియో వైరల్

by GSrikanth |   ( Updated:2023-09-26 14:37:16.0  )
పాదాలు తాకగానే లేచి నిల్చొని ఆశీర్వదిస్తున్న గణపయ్య.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: గణేష్ నవరాత్రి ఉత్సవాలు గత సోమవారం ప్రారంభం అయ్యాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ముంబై, కలకత్తా, హైదరాబాద్ వంటి నగరాల్లో మరింత గ్రాండ్‌గా నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగానే గణపతి విగ్రహాలను సైతం వినూత్నంగా తయారు చేస్తుంటారు. బాహుబలి చిత్రం విడుదలైన నాటి నుంచి రకరకాలుగా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి రూపంలో తయారు చేయడంతో సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.

ఇక ఈసారి అయితే, ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ లాగా, పుష్పలో బన్నీ లాగా, జవాన్‌లో షారుఖ్ లాగా తయారు చేసి భక్తులను ఆకర్షించారు. కానీ, మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఓ శిల్పి వినాయకుడి విగ్రహాన్ని మరింత ఇంట్రెస్టింగ్‌గా తయారు చేశారు. భక్తులు విగ్రహం పాదాలను తాకగానే నిలబడి ఆశీర్వదించేలా అమర్చారు. దీంతో ఇలాంటి ప్రతిభావంతులైన ఇంజనీర్లు దేశవ్యాప్తంగా ఉన్నారని వారిని తప్పక అభినందించాల్సిందే అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed