Amit Shah: కాంగ్రెస్ చీఫ్ వి ద్వేషపూరితమైన వ్యాఖ్యలు.. ఖర్గేకు అమిత్ షా కౌంటర్

by Shamantha N |   ( Updated:2024-09-30 07:01:13.0  )
Amit Shah: కాంగ్రెస్ చీఫ్ వి ద్వేషపూరితమైన వ్యాఖ్యలు.. ఖర్గేకు అమిత్ షా కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge)కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) చురకలు అంటించారు. జమ్మూకశ్మీర్‌లో ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలపై అమిత్‌షా విమర్శలు గుప్పించారు. అవి ద్వేషపూరితమైన వ్యాఖ్యలని అన్నారు. ఖర్గే తన వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లోకి మోడీని అనవసరంగా లాగుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ లో పోస్టు పెట్టారు. ‘‘నిన్న జమ్ముకశ్మీర్‌లో ప్రసంగం చేసిన మల్లికార్జున ఖర్గే.. అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి తన పార్టీ నేతలను మించిపోయారు. ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ నేతలకున్న ద్వేషం, భయం బయటపడింది. వారు ఎప్పుడూ మోడీ గురించే ఆలోచిస్తున్నారని తెలుస్తోంది ’’ అని అమిత్ షా విమర్శించారు. అంతేకాకుండా ఖర్గే ఆరోగ్యంపై స్పందిస్తూ చురకలు అంటించారు. ‘‘ఖర్గే ఆరోగ్యంగా ఉండాలని మోడీ, నేను ప్రార్థిస్తున్నాం. ఆయన పూర్తి ఆరోగ్యంతో జీవించాలని అందరం ప్రార్థించాలి. ఆయన ఇంకా ఏళ్ల పాటు జీవించాలి. 2047 నాటి వికసిత్‌ భారత్‌ను చూడాలి’’ అని అమిత్ షా ఆకాంక్షించారు.

ఖర్గే ఏమన్నారంటే?

జమ్ముకశ్మీర్‌లోని జస్‌రోటాలో ఆదివారం ఏర్పాటుచేసిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే ప్రసంగించారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే వరకూ పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తుతం ఖర్గే వయసు 83 సంవత్సరాలైనప్పటికీ అప్పుడే చనిపోనని ప్రధాని మోడీని గద్దె దించేవరకూ రాజకీయాల్లో క్రియాశీలంగానే ఉంటానని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్ లో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ట్రీట్మెంత్ తర్వాత భావోద్వేగపూరితంగా ప్రసంగిస్తూ మోడీని ఉద్దేశిస్తూ.. వ్యాఖ్యలు చేశారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు అస్వస్థతకు గురైన ఖర్గేకు ప్రధాని మోడీ ఫోన్‌ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed