- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amit Shah: దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తున్నారు.. రాహుల్ పై ఫైర్ అయిన అమిత్ షా
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా(USA) పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై కేంద్రహోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా, ప్రజలు మనావాలు దెబ్బతీసేలా మాట్లాడతారని ఫైర్ అయ్యారు. “ దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతోన్న శక్తులకు అండగా నిలబడటం, దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్(Congress) కు అలవాటుగా మారింది. జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన దేశవ్యతిరేక, రిజర్వేషన్ల వ్యతిరేక అజెండాకు మద్దతు ఇవ్వడమైనా సరే, విదేశీ గడ్డపై దేశానికి వ్యతిరేక ప్రకటనలైనా సరే.. ఆయన ప్రతిసారీ దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారు. మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ప్రాంతీయవాదం, మతం, భాష పరంగా చీలికలు తెసుకువచ్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్ గాంధీయే బయటపెట్టారు. రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడి.. వాటిపై కాంగ్రెస్ వ్యతిరేకతను మరోసారి తెరపైకి తెచ్చారు. అతని మదిలోని ఆలోచనలే చివరకి మాటలుగా బయటకొచ్చాయి. బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరని.. దేశ భద్రతతో ఎవరూ చెలగాటమాడలేరు అని రాహుల్ గాంధీకి చెప్పాలనుకుంటున్నాను.’ అని అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ ఏమన్నారంటే?
అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై మాట్లాడారు. వాషింగ్టన్ డీసీలోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో రాహుల్ ప్రసంగించారు. "భారతదేశం న్యాయమైన ప్రదేశంగా మారినప్పుడే రిజర్వేషన్‌లను రద్దు చేయడం గురించి ఆలోచించాలి. ప్రస్తుతం భారతదేశం న్యాయమైన ప్రదేశం కాదు" అని అన్నారు. రిజర్వేషన్లు, భారతదేశంలో మత స్వేచ్ఛపై రాహుల్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే.. అమిత్ షా ఆకామెంట్ల పై స్పందించారు. అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అంతే కాకుండా, బీజేపీ నేతలు(BJP leaders) సైతం రాహుల్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.