కాంగ్రెస్ మేనిఫెస్టో విడుద‌లైన త‌ర్వాత బీజేపీ గ్రాఫ్ పెరిగింది: అమిత్ షా

by Dishanational1 |
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుద‌లైన త‌ర్వాత బీజేపీ గ్రాఫ్ పెరిగింది: అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశమంతా షరియా చట్టాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇదే సమయంలో, ప్రజలు మాట మీద నిలబడే పార్టీని ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. శుక్రవారం ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైన తర్వాత బీజేపీ గ్రాఫ్ పెరిగిందని, వాళ్ల మేనిఫెస్టోలో కాంగ్రెస్ మళ్లీ బుజ్జగింపు రాజకీయ వ్యాఖ్యలను హామీగా ఇవ్వడమే ఇందుకు కారణమని అన్నారు. దేశాన్ని విభజించే వ్యక్తిగత చట్టాన్ని ముందుకు తీసుకెళ్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో స్పష్టం చేస్తోంది. దేశ పురోగతి, అభ్యున్నతికి దోహదపడే పార్టీకి మద్దతివ్వాలని ఓటర్లను కోరుతున్నాను. అలాగే, దేశాన్ని షరియా చట్టం ప్రకారం ముందుకు తీసుకెళ్తారా అని రాహుల్ గాంధీని అడగాలనుకుంటున్నట్టు అమిత్ షా పేర్కొనారు. మన రాజ్యాంగం లౌకిక పునాదులపై ఏర్పడిందని, మత ప్రాతిపదికన మన చట్టాలు రూపొందవని వెల్లడించారు. బీజేపీ తన మ్యానిఫెస్టోలో స్పష్టంగా ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) తీసుకొస్తామని పేర్కొన్నాం. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసి యూసీఈ తెచ్చాం. దీన్ని ముందుకు తీసుకెతీసుకెళ్తాం. నరేంద్ర మోడీ మరోసారి దేశ ప్రధానిగా అధికారం చేపడతారని ఆశిస్తున్నట్టు అమిత్ షా వెల్లడించారు.



Next Story

Most Viewed