AIIMS: వైద్యుల సమ్మెతో ఎయిమ్స్‌లో తగ్గిన అడ్మిషన్లు, ఓటీ సేవలు

by S Gopi |
AIIMS: వైద్యుల సమ్మెతో ఎయిమ్స్‌లో తగ్గిన అడ్మిషన్లు, ఓటీ సేవలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ మెడికల్ కాలేజీలో మహిళా ట్రైనీ డాక్టర్ లైంగిక దాడి, హత్యపై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) ఢిల్లీలో డాక్టర్లు సమ్మెకు దిగారు. దీనివల్ల ఎయిమ్స్‌లో అడ్మిషన్లు 65 శాతం, ఆపరేషన్ థియేటర్ సర్వీసెస్ 85 శాతం తగ్గాయి. వాటితో పాటు ఓపీడీ 55 శాతం, లేబొరేటరీ సేవలు 20 శాతం, రేడియోలాజికల్ పరిశోధనలు 40 శాతం, న్యూక్లియర్ మెడిసిన్ 20 శాతం తగ్గాయి. ఎయిమ్స్ అధికారిక వివరాల ప్రకారం.. అత్యవసర సేవలు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఐసీయూలు) సాధారణంగా పనిచేస్తున్నాయని, ఎయిమ్స్ సిబ్బంది తమ విధులకు హాజరవుతున్నారని పేర్కొంది. బ్లడ్ బ్యాంకులు కూడా సాధారణంగా పనిచేస్తున్నాయి. మహిళా ట్రైనీ డాక్టర్ హత్యకు వ్యతిరేకంగా మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ఓపీడీ సేవలను బంద్ చేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్(ఫైమా) పిలుపునిచ్చిన నేపథ్యంలో వైద్యులు, వైద్య విద్యార్థులు ఎయిమ్స్ వద్ద నిరసన చేపట్టారు. దీనిపై ఢిల్లీలోని రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఎయిమ్స్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఇంద్రశేఖర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. 'ఇది చాలా దారుణమైన ఘటన. డ్యూటీలో ఉన్న మహిళపై లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హత్య చేశారు. పని ప్రదేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే మహిళలు ఎలా పని చేస్తారని? భద్రతా సమస్యలకు సంబంధించి అనేక డిమాండ్లు ఉన్నాయని, దీనిపై సీబీఐ విచారణ జరగాలని కోరుతుAIMన్నాం, అప్పటి వరకు మేము మా నిరసనను కొనసాగిస్తా'మన్నారు.

Advertisement

Next Story

Most Viewed