రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టాలని మా కోరిక: అమేథీ ఎంపీ కిశోరీ లాల్

by Harish |   ( Updated:2024-06-09 04:52:49.0  )
రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టాలని మా కోరిక: అమేథీ ఎంపీ కిశోరీ లాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీని లోక్‌సభ పక్ష నేతగా ఏకగ్రీవంగా తీర్మానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమేథీ ఎంపీ కిశోరీ లాల్ శర్మ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టాలన్నది కాంగ్రెస్ పార్టీ సమిష్టి కోరిక అని ఒక సమావేశంలో అన్నారు. ఖర్గే జీ మా నాయకుడు, ఆయనతో పాటు, మిగతా సభ్యులందరం కూడా రాహుల్‌ను లోక్‌సభ పక్ష నేతగా ఎన్నుకున్నాం. ఇది మా అందరి సమిష్టి నిర్ణయం, అలాగే పార్టీ కోరిక అని ఆయన అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ తిరిగి ఎన్నిక కావడం పట్ల మాట్లాడిన శర్మ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఆమె మార్గదర్శకత్వంలో నేను పార్లమెంటులో ఎంపీగా పని చేస్తానని తెలిపారు.

శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన సీపీపీ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ మరోసారి ఎన్నికయ్యారు. దానికి ముందు అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ పదవికి సోనియా గాంధీ పేరును ప్రతిపాదించగా సభ్యులందరూ కూడా అందుకు ఆమోదం తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోట అమేథీ నియోజకవర్గంలో కిషోరీ లాల్ శర్మ బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీపై 1,67,196 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

Advertisement

Next Story

Most Viewed