- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోర్టు ధిక్కరణ కేసు: ఐఏఎస్‌లకు బెయిలబుల్ వారెంట్
దిశ, తెలంగాణ బ్యూరో: న్యాయస్థానం వెలువరించిన ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఉత్తరప్రదేశ్ ఆర్థికశాఖ స్పెషల్ సెక్రటరీ సరయూ ప్రసాద్ మిశ్రా, ఫైనాన్స్ సెక్రటరీ (లా సెక్రటరీ కూడా) ఎస్ఎంఏ రిజ్వీ అనే ఇద్దరు ఐఏఎస్ అధికారులకు అలహాబాద్ హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. దీనికి అనుగుణంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆ ఇద్దరినీ బుధవారం అరెస్టు చేశారు. వారిని గురువారం హైకోర్టులో హాజరుపరిచారు. జస్టిస్ సునీత్ కుమార్, జస్టిస్ రాజేంద్రకుమార్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. వీరిద్దరినీ ఉద్దేశించి ఎందుకు అభియోగాలు నమోదు చేయకూడదో వివరణ ఇవ్వాలని ప్రశ్నించిది. కొంతసేపు వాదనలు జరిగిన తర్వాత వారిద్దరినీ అదుపులోకి తీసుకోవాల్సిందిగా పోలీసులను బెంచ్ ఆదేశించింది. వారిద్దరికీ బెయిల్ మంజూరు విషయమై తదుపరి విచారణ సందర్భంగా తేల్చనున్నట్లు స్పష్టం చేసింది.
ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, పీఎస్ నర్సింహలతో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుని తదుపరి విచారణ జరిగేంత వరకు హైకోర్టు తీర్పును అమలు చేయొద్దని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. అరెస్టు చేసిన ఇద్దరినీ వెంటనే విడిచిపెట్టాలని హైకోర్టును, పోలీసుల్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు నిర్దిష్టమైన ఆదేశాలు జారీచేసి.. వీరి విడుదల గురించి అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ఫోన్ చేయడంతో పాటు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చి తక్షణం వారి విడుదలకు సంబంధించిన ఏర్పాట్లపై వివరించాలని పేర్కొన్నది. దీంతో వారిద్దిరినీ పోలీసులు విడుదల చేశారు.
పదవీ విరమణ చేసిన జడ్జీలకు ఇంటి పనుల కోసం ‘డొమెస్టిక్ హెల్ప్’ సిబ్బందిని నియమించాలని రిటైర్డ్ జడ్జీల అసోసియేషన్ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన అలహాబాద్ హైకోర్టు ఈనెల 4న స్పష్టమైన ఆదేశాలతో ఉత్తర్వులు జారీచేసింది. వారికి డొమెస్టిక్ హెల్ప్ సౌకర్యంతో పాటు వారికి జీతభత్యాలు తదితరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని అధికారుల బృందం ఈ ఉత్తర్వులపై చర్చించి ఆర్థికశాఖ కార్యదర్శికి సూచనలు చేశారు. చివరకు ఇది అమల్లోకి రాలేదు. ఈ విషయమై అలహాబాద్ హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించి అరెస్టుకు ఆదేశాలు జారీచేసింది. ఆ వెంటనే సుప్రీంకోర్టు విడుదల చేయాలంటూ ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణ సందర్భంగా లోతుగా వాదనలు వింటామని పేర్కొన్నది.