ఆవును రక్షిత జాతీయ జంతువుగా ప్రకటించి.. గోవధ నిషేధ చట్టం చేయాలి: అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Vinod kumar |
ఆవును రక్షిత జాతీయ జంతువుగా ప్రకటించి.. గోవధ నిషేధ చట్టం చేయాలి: అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

లక్నో: అలహాబాద్ కోర్టు కేంద్రానికి కీలక సూచనలు చేసింది. గోవులను 'రక్షిత జాతీయ జంతువు' గా ప్రకటించాలని కోరింది. అంతేకాకుండా దేశంలో గోహత్యను నిషేధించేందుకు తగిన చట్టాన్ని కూడా రూపొందించాలని కేంద్రాన్ని హైకోర్టు కోరింది. గోవధ పై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు లక్నో బెంచ్ పేర్కొంది. ‘మనం లౌకిక దేశంలో జీవిస్తున్నాము. అన్ని మతాలను గౌరవించాలి.

హిందూ మతంలో ఆవు దైవత్వానికి, సహజమైన దయకు ప్రతినిధి అని నమ్మకం. కాబట్టి దానిని రక్షించాలి’ అని జస్టిస్ షమీమ్ అహ్మద్ అన్నారు. ఒక వ్యక్తిపై గోహత్యలకు సంబంధించి తనపై క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గోహత్య నిరోధక చట్టం కింద కోర్టు తోసిపుచ్చింది. ఆవు ను పురాణాల్లో దేవుళ్ల జీవితాలతో ముడిపడి ఉన్నాయని, సహజంగానే దైవత్వాన్ని కలిగి ఉందని తెలిపింది. ఈ కారణంగా రక్షణ కల్పించాలని, అందరూ గౌరవించాలని సూచించింది.

Advertisement

Next Story