- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్యాంపరింగ్ జరిగితే అన్ని సీట్లు వచ్చేవి కాదు.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: ఈవీఎం ల ట్యాంపరింగ్ జరిగి ఉంటే వారికి అన్ని సీట్లు వచ్చి ఉండేవి కాదని, ఇప్పుడు వారు వినోదం కోసం మాత్రమే మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి జితన్ రాం మాంఝీ అన్నారు. ఈవీఎంలపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ప్రతిపక్షాలపై పలు విమర్శలు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగేందుకు ఆస్కారం లేదని సుప్రీం కోర్టు చెప్పిందని, అలాంటప్పుడు ప్రతిపక్షాలు తమ వినోదం కోసం మాత్రమే ఈ మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఈవీఎం ల ట్యాంపరింగ్ గురించి చర్చ జరిగి ఉంటే వారికి అన్ని సీట్లు వచ్చి ఉండేవి కాదని విమర్శించారు.
ఎన్నికల ముందు రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ప్రజలను తప్పుదోవ పట్టించినట్లే ఈవీఎంలపై కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని తెలిపారు. కాగా రాహుల్ గాంధీ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఈవీఎం ట్యాంపరింగ్ పై చేసిన వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ.. భారతదేశంలోని ఈవీఎంలు ఒక "బ్లాక్ బాక్స్" అని, వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి లేదని, మా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయని అన్నారు. అలాగే సంస్థలకు జవాబుదారీతనం లేనప్పుడు ప్రజాస్వామ్యం బూటకమని, మోసానికి గురవుతుందని మండిపడ్డారు.