- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నీట్ యూజీ పిటిషన్లన్నీ బదిలీ చేయాలి.. హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
దిశ, నేషనల్ బ్యూరో: నీట్ యూజీ పరీక్షను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లంటినీ వెంటనే సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు ట్రాన్స్ ఫర్ చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ వ్యాజ్యాన్ని సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. ఎన్ఐఏ విజ్ఞప్తికి అంగీకరించింది. నీట్-యూజీ పరీక్షకు సంబంధించిన విషయాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు గతంలో జూన్ 20న, నీట్-యూజీ పేపర్ లీకేజీకి సంబంధించి దేశంలోని వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న విచారణలపైనా స్టే విధించింది. కాగా, ఈ ఏడాది నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు జూలై 18కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.