Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికలపై అఖిలేష్ యాదవ్ కీలక ప్రకటన

by Shamantha N |
Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికలపై అఖిలేష్ యాదవ్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికలపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఉప ఎన్నికల్లో మొత్తం తొమ్మిది స్థానాల్లో కూటమి అభ్యర్థులందరూ తమ పార్టీ ఎన్నికల గుర్తు 'సైకిల్'పైనే పోటీ చేస్తరని ప్రకటించారు. కూటమి నిర్ణయాన్ని సీట్ల పంపకానికి సంబంధించిన విషయమేమీ తెలియదని, విజయం సాధించడం ఒకటే కీలకమని అన్నారు. "కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఐక్యంగా ఉన్నాయి. ఒక పెద్ద విజయం కోసం కలిసి పోరడుతున్నాయి. ఈ ఉప ఎన్నికలో ఇండియ కూటమి విజయం కొత్త అధ్యాయాన్ని లిఖించబోతుంది" అని అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియ ఎక్స్ లో పోస్టు చేశరు. అందరి అపూర్వమైన సహకారం, మద్దతుతో ఉపఎన్నికలో అన్ని సీట్లలో గెలుపొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

9 స్థానాల్లో ఉపఎన్నికలు

నవంబరు 13న కతేహరి (అంబేద్కర్ నగర్), కర్హల్ (మెయిన్‌పురి), మీరాపూర్ (ముజఫర్‌నగర్), ఘజియాబాద్, మఝవాన్ (మీర్జాపూర్), సిసమావు (కాన్పూర్ నగరం), ఖైర్ (అలీఘర్), ఫుల్‌పూర్ (ప్రయాగ్‌రాజ్) , కుందర్కి (మొరాదాబాద్) స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. 8 మంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఆ స్థానంలో బైపోల్స్ జరుగుతున్నాయి. ఇకపోతే, క్రిమినల్ కేసులో దోషిగా తేలిన ఎస్పీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకిపై అనర్హత వేటు వేయడంతో సిసమావు స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే, పది అసెంబ్లీ స్థానాల్లో ఐదు సీట్లను కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే, ఘజియాబాద్, ఖైర్ (అలీఘర్) రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ అంగీకరించిందని, మిగిలిన స్థానాలను ఎస్పీకి వదిలివేసినట్లు వార్తలొచ్చాయి. మిల్కీపూర్ (అయోధ్య)ని పక్కనబెట్టి తొమ్మిది స్థానాలకు ఉప ఎన్నికను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇకపోతే, నవంబర్ 13న ఓటింగ్ జరగగా.. 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed