- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీలైనంత త్వరగా అమరావతి రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయాలి: డిప్యూటీ సీఎం పవన్
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో గురువారం జరిగిన కేంద్ర కేబినెట్(Central Cabinet) సమావేశంలో ఏపీ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించారు. అమరావతి(Amaravati) ప్రజల కలగా నిలిచిన రైల్వే ప్రాజెక్టు(railway project)పై చర్చించిన కేబినెట్.. వెంటనే ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnav)మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) చొరవతోనే అమరావతి రైల్వే ప్రాజెక్టు(Amaravati railway project )కు ఆమోదం తెలిపిందని చెప్పుకొచ్చారు. కాగా ఈ రైల్వే ప్రాజెక్ట్‌కు కేంద్ర ఆమోదం తెలపడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. అమరావతి రైల్వే ప్రాజెక్ట్ ఏపీకి పెద్ద బూస్ట్. వీలైనంత త్వరగా అమరావతి రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఇది రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో ప్రధాని మోదీ అమరావతి శంకుస్థాపనకు వచ్చారు. కానీ కొంతమంది వలన అర్థ శతాబ్ధం విలువైన సమయం వృధా అయిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
ఏపీ రాజధాని అమరావతి రైల్వే లైన్(Railway line to Amaravati.)కు కేబినెట్(Cabinet) ఆమోదం తెలిపింది. గంటూరు జిల్లా ఎర్రుపాలెం(Yerrupalem) నుంచి అమరావతి మీదుగా నంబూరు(Nambur) వరకు కొత్త రైల్వే లైన్ వేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అంతేకాకుండా.. రూ. 2,245 కోట్లు విడుదల కు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కృష్ణా నది(Krishna river)పై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే బ్రిడ్జి ను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ నగరాలతోఈ రైల్వే లైన్ అనుసంధానం కానున్నట్లు