రేపే JEE రాత పరీక్ష.. అంతా సిద్ధం

by Harish |   ( Updated:2024-01-23 13:36:31.0  )
రేపే JEE రాత పరీక్ష.. అంతా సిద్ధం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్-1 (JEE మెయిన్ 2024) పరీక్షను రేపు(జనవరి 24న) నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఒక ప్రకటనలో పేర్కొంది. ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డులు, గుర్తింపు కోసం ఒరిజినల్ ఐడీ కార్డును తమ వెంట తీసుకెళ్లాలి.

పరీక్షను రెండు షిప్ట్‌లలో నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుండి 12 గంటల వరకు, రెండవది మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఈ పరీక్షలు 2024 జనవరి 24, 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరగనున్నాయి.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన పత్రాలు: అడ్మిట్ కార్డు, వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం, గుర్తింపు కోసం (పాన్ కార్డు / డ్రైవింగ్ లైసెన్స్ / ఓటర్ ఐడీ / పాస్ పోర్ట్ / ఆధార్ కార్డు, పాఠశాల గుర్తింపు కార్డు), పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్‌ను తీసుకెళ్ళాలి.

Read More..

BREAKING: గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. దరఖాస్తు గడువు తేదీ పెంపు

Advertisement

Next Story

Most Viewed