మాజీ సీఎంపై అమిత్ షా ఫైర్.. దమ్ముంటే ఆ రికార్డ్ చూపించాలంటూ సవాల్

by Disha News Web Desk |
మాజీ సీఎంపై అమిత్ షా ఫైర్.. దమ్ముంటే ఆ రికార్డ్ చూపించాలంటూ సవాల్
X

లక్నో: కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అఖిలేష్ ప్రభుత్వ హయాంలో అబద్ధాలు చెప్పడానికి సిగ్గు పడేవాడు కాదని ఆరోపించారు. మాఫియా, గుండారాజ్‌లకు ఆయన ప్రభుత్వంలోనే ఆజ్యం పోశారని విమర్శించారు. ముజఫర్ నగర్‌లో శనివారం జరిగిన 'ప్రభావి మత్తాతా సంవాద్' కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 'అఖిలేష్ యాదవ్ అబద్ధాలు చెప్పడానికి ఎలాంటి సిగ్గు పడరు. ఇతరులు నిజం అనుకునేలా ఆయన అబద్ధాలు చెప్తాడు. యూపీలో శాంతి భద్రతలు సరైనవి కాదని ఆయన అన్నారు' అని తెలిపారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక శాంతి భద్రత సమస్యలు తగ్గుముఖం పట్టాయని అమిత్ షా ఉద్ఘాటించారు. యోగీ నాయకత్వంలో రాష్ట్రంలో దోపిడీలు 70 శాతం, దొంగతనాలు 69 శాతం, హత్యలు 30 శాతం, కిడ్నాప్‌లు 35 శాతం, లైంగికదాడులు 30 శాతానికి పైగా తగ్గాయని అన్నారు. ధైర్యం ఉంటే అఖిలేష్ తన ప్రభుత్వ హయాంలోని గణాంకాలను చూపించాలని అమిత్ షా సవాల్ చేశారు. కులం గురించి బహుజన సమాజ్ పార్టీ, కాంగ్రెస్ ప్రాంతీయత, అఖిలేష్ యాదవ్ మాఫియా, గుండారాజ్యం గురించి మాట్లాడుతారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం హయాంలోనే యూపీ నెం.1 రాష్ట్రంగా ఎదుగుతుందని తెలిపారు. 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న యూపీలో ఏడు విడుతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.


Advertisement

Next Story

Most Viewed