Akhil giri resign: బెంగాల్ మంత్రి అఖిల్ గిరి రిజైన్..సారీ మాత్రం చెప్పబోనని వెల్లడి

by vinod kumar |
Akhil giri resign: బెంగాల్ మంత్రి అఖిల్ గిరి రిజైన్..సారీ మాత్రం చెప్పబోనని వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: మహిళా అటవీ అధికారిపై అనుచితంగా ప్రవర్తించడంతో చిక్కుల్లో పడ్డ పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం తన రాజీనామాను సీఎం కార్యాలయానికి పంపించారు. అనంతరం ఎమ్మెల్యే నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘సీఎం ఆఫీసుకు ప్రధాన కార్యదర్శి ద్వారా నా రాజీనామాను సమర్పించా. కానీ నేను ఏ అధికారికీ క్షమాపణ చెప్పబోను. కేవలం సీఎం మమతా బెనర్జికి మాత్రమే సారీ చెబుతా’ అని వ్యాఖ్యానించారు. అటవీ అధికారులు ప్రజలను ఎలా హింసిస్తున్నారో చూసి మాత్రమే ఆగ్రహం వ్యక్తం చేశానని స్పష్టం చేశారు. నేను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని, ఒక నిర్దిష్ట పదాన్ని ఉపయోగించినందుకు మాత్రం క్షమించాలని కోరారు.

నా పదవీకాలం 2026 వరకు ఉందని, పార్టీ అవసరాల మేరకు ఎమ్మెల్యేగా పని చేస్తానన్నారు. టీఎంసీ ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్టు చెప్పారు. కాగా, ఓ మహిళా అధికారితో అఖిల గిరి అనుచితంగా ప్రవర్తించిన వీడియోను బెంగాల్ బీజేపీ షేర్ చేసింది. ఆ వీడియోలో మహిళా అధికారిణి మనీషా సాహుపై అఖిల్ గిరి అరుస్తూ కనిపించాడు. దీంతో అఖిల్‌పై పలువురు విమర్శలు గుప్పించగా..టీఎంసీ సైతం స్పందించి పదవికి రాజీనామా చేయాలని ఆయనకు సూచించింది. ఈ నేపథ్యంలోనే అఖిల్ రిజైన్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed