NCP: గ్రామీణ ప్రాంతాల్లో 2.5 మిలియన్ల ఉద్యోగాలు

by Shamantha N |   ( Updated:2024-11-06 11:02:23.0  )
NCP: గ్రామీణ ప్రాంతాల్లో 2.5 మిలియన్ల ఉద్యోగాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు (Maharashtra Assembly Polls) త్వరలోనే జరగనున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో అజిత్‌ పవార్‌ సారథ్యంలోని ఎన్సీపీ(NCP) మ్యానిఫెస్టో విడుదల చేసింది. బారామతిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే కొత్త మహారాష్ట్ర విజన్‌ను అందజేస్తామని అజిత్ పవార్‌ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, వ్యవసాయ సదుపాయాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సునీల్ తట్కరే ముంబయిలో, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ గోండియాలో మ్యానిఫెస్టోను విడివిడిగా ఆవిష్కరించారు.

మ్యానిఫెస్టోలో ఏముందంటే?

గ్రామీణ ప్రాంతాల్లో 2.5 మిలియన్ల ఉద్యోగాల కల్పిస్తామని ఎన్సీపీ హామీ ఇచ్చింది. లడ్కీ బహిన్ పథకం(Ladki Bahan scheme) నెలవారీ సాయం రూ.1,500 నుంచి రూ.2,100కు పెంపు, వృద్ధాప్య పింఛను రూ.1,500 నుంచి రూ.2,100కు పెంపుని ప్రతిపాదించింది. వరి రైతులకు హెక్టారుకు 25వేల బోనస్‌.. షెట్కారీ సన్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.15,000 ఇస్తామని ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో 45,000 ‘పనంద్’ రోడ్ల నిర్మాణం, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లకు రూ.15,000 నెలవారీ జీతం ఇస్తామంది. సోలార్, రిన్యువబుల్ ఎనర్జీకి ప్రాధాన్యత కల్పిస్తామని.. వారికి విద్యుత్ బిల్లులో 30 శాతం తగ్గిస్తామంది. ఇకపోతే, 288 మంది శాసనసభ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో నవంబరు 20న ఒకేవిడతలో పోలింగ్ జరగనుంది. నవంబరు 23న ఫలితాలను ప్రకటించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed

    null