- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి అజిత్ పవార్’
దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఏ క్షణంలోనైనా మహా వికాస్ అఘాడి కూటమి పుట్టి ముంచుతారనే ప్రచారం రోజు రోజుకూ పెరుగుతోంది. ఆయన తనకు అనుకూలంగా ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుందుకున్న వేళ ఆ రాష్ట్రంలో అనూహ్య సన్నివేశం చోటుచేసుకుంది. అజిత్ పవార్ మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి అంటూ భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. ధారాశివ్‌లో దర్శనం ఇస్తున్న ఈ ఫ్లెక్సీలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.
ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. '2024 వరకు వేచి చూడటం ఎందుకు? ఇప్పుడే మేం సీఎం పదవి పందడానికి ప్రయత్నిస్తున్నాం'. తాను వంద శాతం సీఎం కావాలనుకుంటున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, మహారాష్ట్రలో శివసేన రెండుగా చీలడంతో ఏక్ నాథ్ షిండే వర్గంతో బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల ఎన్సీపీ.. బీజేపీకి సపోర్ట్‌గా నిలుస్తోందని దాంతో మహా వికాస్ అఘాడీలో చీలికలు తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అజిత్ పవార్ సీఎం అంటూ పోస్టర్లు దర్శనం ఇవ్వడం పొలిటికల్ కారిడార్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
#WATCH | Poster appears in Dharashiv terming NCP leader Ajit Pawar as the future CM of Maharashtra. pic.twitter.com/m7dM3rXA6x
— ANI (@ANI) April 25, 2023