- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లో మరో కొత్త కూటమి.. అవామీ ఇత్తెహాద్, జమాతే ఇస్లామీ జట్టు
దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం మరో కొత్త కూటమి ఏర్పడింది. అవామీ ఇత్తెహాద్ పార్టీ (ఏఐపీ), జమాతే ఇస్లామీ (జేఈఐ) కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఆదివారం శ్రీనగర్‌లో జరిగిన ఇరుపార్టీల సంయుక్త సమావేశంలో కూటమి ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేశారు. జమ్మూకశ్మీర్ ప్రజల హక్కుల సాధన కోసమే ఈ కూటమిని ఏర్పాటు చేశామని వెల్లడించారు. కుల్గాం, పుల్వామా జిల్లాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే జమాతే ఇస్లామీ అభ్యర్థులకు అవామీ ఇత్తెహాద్ పార్టీ మద్దతు పలకనుంది.
కశ్మీర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవామీ ఇత్తెహాద్ పార్టీ అభ్యర్థులకు జమాతే ఇస్లామీ మద్దతు ఇవ్వనుంది. లాంగాటే, దేవ్‌సర్, జైనాపొర అసెంబ్లీ స్థానాల్లో ఇరు పార్టీలు స్నేహపూర్వకంగా పోటీ చేయనున్నాయి. కాగా, ఆదివారం జరిగిన సమావేశంలో అవామీ ఇత్తెహాద్ పార్టీ చీఫ్ ఇంజినీర్ రషీద్, జమాతే ఇస్లామీ నేత గులాం ఖాదిర్ వాని తదితరులు పాల్గొన్నారు.