లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు మద్దతుగా ఎంఐఎం..!

by Shamantha N |
లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు మద్దతుగా ఎంఐఎం..!
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో 400 మార్కు దాటేందుకు బీజేపీ భారీగా ప్రచారం చేస్తోంది. ఈసారి సౌత్ పైనే ఎక్కువగా ఫోకస్ చేసింది బీజేపీ. అయితే గతేడాది అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు తెగిపోయింది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై చేస్తున్న ప్రకటనలపై అన్నా డీఎంకే నేతలు గుర్రుగా ఉన్నారు. దీంతో, ఎప్పటికీ బీజేపీతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్నే సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లను వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకేతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఏప్రిల్ 19న తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగనుంది. ఈ రాష్ట్రంలో డీఎంకే, ఎఐఎడీఎంకేలను ఎదుర్కోవడానికి బీజేపీ తరపున ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా అనేక ర్యాలీలు నిర్వహించారు. ఇక్కడ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఐయూఎంఎల్, వీసీకే, కమల్ హాసన్ నేతృత్వంలోని ఎంఎన్ఎం పార్టీ, ఎండీఎంకే, గౌండర్ పార్టీలతో కూడిన ఇండియా కూటమికి డీఎంకే నాయకత్వం వహిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed