- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెంగళూరుకు చేరుకున్న సోనియా, రాహుల్, ఖర్గే.. స్వాగతం పలికిన సిద్ధరామయ్య, డీకే
దిశ, వెబ్ డెస్క్: దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విపక్ష పార్టీలు ఏకమవుతున్నాయి. ఇందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పలు పార్టీలు ఎన్డీఏకు చెక్ పెట్టి తాము అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోని పలు విపక్ష పార్టీలు ఈ నెల 17, 18 తేదీల్లో బెంగళూరులో సమావేశం నిర్వహించనున్నాయి. ఈ మీటింగ్ లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గే ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకున్నారు.
వారికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు పలువురు సీనియర్ నేతలు స్వాగతం పలికారు. ఇక ఇవాళ, రేపు రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో మొత్తం 24 పార్టీల నాయకులు హాజరుకానున్నారు. వారిలో జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన తనయుడు తేజస్వీ యాదవ్, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖంగ్ సీఎం హేమంత్ సోరెన్ తదితరులు పాల్గొననున్నారు.