AI Lawyer : సీజేఐ ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఏఐ లాయర్!

by M.Rajitha |
AI Lawyer : సీజేఐ ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఏఐ లాయర్!
X

దిశ, వెబ్ డెస్క్ : సీజేఐ అడిగిన ఓ ప్రశ్నకు ఏఐ మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఇచ్చింది. గురువారం ఢిల్లీలో నేషనల్ జ్యుడీషియల్ మ్యూజియం ప్రారంభోత్సవంలో సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్ (CJI Justice DY Chandrachud)పాల్గొన్నారు. అనంతరం అక్కడ కొద్దిసేపు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాయర్(AI Lawyer) తో మాట్లాడారు. అయితే ఏఐ లాయర్ ను పరీక్షించేందుకు సీజేఐ అడిగిన ఓ ప్రశ్నకు ఏఐ ఇచ్చిన సమాధానానికి అంతా షాక్ అయ్యారు. కొన్ని ప్రత్యేక కేసుల్లో విధిస్తున్న మరణశిక్ష రాజ్యాంగబద్ధమైనదేనా అని జస్టిస్ డి.వై చంద్రచూడ్ అడిగిన ప్రశ్నకు.. చట్ట ప్రకారం సరి అయినదే అని చెప్పింది. అరుదైన కేసుల్లో మాత్రమే ఈ శిక్ష విధిస్తారు అని సమాధానం తెలిపింది. అయితే చట్టంలో ఉన్న ప్రకారమే ఏఐ లాయర్ సమాధానం చెప్పినప్పటికీ.. మరణశిక్ష వంటి సున్నిత అంశాన్ని మనుషుల్లాగా ఏఐ చూడలేకపోవడం గమనార్హం. యంత్రాలు వాటికి అందజేసే సమాచారం మేరకు ఆలోచించి, సమస్య పరిష్కరిస్తాయి. మనం ఇచ్చే డేటా ఎంత కచ్చితంగా ఉంటే అంత కచ్చితమైన ఫలితం ఏఐ నుండి ఉంటుంది.

Advertisement

Next Story