ఇండియా 75 ఏళ్ల స్వాతంత్య్రానికి అంత‌రిక్షం నుండి శుభాకాంక్ష‌లు!

by Sumithra |   ( Updated:2022-09-08 13:47:07.0  )
ఇండియా 75 ఏళ్ల స్వాతంత్య్రానికి అంత‌రిక్షం నుండి శుభాకాంక్ష‌లు!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర‌ వేడుకలను నిర్వ‌హించుకుంటున్న సందర్భంగా అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం నుండి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇటాలియన్ వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి ఈ వీడియో సందేశాన్ని పంప‌గా, ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ఈ సంద‌ర్బంగా ఆమె, 2023లో ప్రారంభం కానున్న భారతదేశపు తొలి మానవ అంతరిక్ష యాత్ర "గగన్‌యాన్" కార్యక్రమంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) విజయవంతం కావాలని కోరారు. "ISA, NASA, అన్ని అంతర్జాతీయ పార్ట్‌న‌ర్స్‌ తరపున, ISRO గెట్‌గోనియన్ ప్రోగ్రామ్‌లో పని చేస్తున్న కార‌ణంగా, అంతరిక్షంలోకి మానవుల్ని పంపడానికి సిద్ధంగా ఉన్నందున నేను శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నాను. భవిష్యత్ అంతరిక్ష పరిశోధనల కోసం ఇస్రోతో మా భాగస్వామ్యాన్ని విస్తరించడం, కలిసి విశ్వాన్ని అన్వేషించడం మ‌నంద‌రి లక్ష్యంగా పనిచేయాల‌ని కోరుకుంటున్నాను" అని అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు షేర్ చేసిన వీడియోలో క్రిస్టోఫోరెట్టి వెల్ల‌డించారు. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా సంధు ఈ సందేశాన్ని పంచుకున్నారు.

భారత స్వాతంత్య్ర పోరాటంలో ధీర వనితలు ఎవరో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed